Big Breaking News : నిరుద్యోగులకు TGPSC మరో గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ తెలిపింది.

Big Breaking News : నిరుద్యోగులకు TGPSC మరో గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గుడ్ న్యూస్ తెలిపింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Dy.EO) / గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-I ఉద్యోగాల భర్తీకి సంబంధించి TGPSC అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 24 అత్యున్నత గెజిటెడ్ కేడర్ పోస్టులను జనరల్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు తదితర వివరాలకు కమిషన్ వెబ్సైట్ https://websitenew.tgpsc.gov.in/ ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.

Next Story