- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైటింగ్ లోపంతో అరగంట నిలిచిన టీజీ20 గ్రాండ్ ఫైనల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో లైటింగ్ సమస్య కారణంగా ఆట సుమారు అరగంట పాటు నిలిచిపోయింది.

దిశ, ఉప్పల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లో లైటింగ్ సమస్య కారణంగా ఆట సుమారు అరగంట పాటు నిలిచిపోయింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక్కసారిగా ఫ్లడ్‌లైట్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అనంతరం సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేయడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌కు ఐపీఎల్ స్థాయి ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, ఫైనల్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీలో లైటింగ్ సమస్య తలెత్తడంపై ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ప్రాథమిక సదుపాయాల నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకుందని పలువురు విమర్శించారు. ఆట నిలిచే సమయానికి అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ మధ్యలో సాంకేతిక అంతరాయం ఏర్పడటంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.






