టీజీ టెట్ కు 1,36,418 దరఖాస్తులు

by Muthe.Rajitha |

టీజీ టెట్- జూన్ 2026 కు సంబంధించి మొత్తం 1,36,418 ధరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి. రమేష్ తెలిపారు.

టీజీ టెట్ కు 1,36,418 దరఖాస్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- జూన్ 2026 కు సంబంధించి మొత్తం 1,36,418 ధరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30 తో ముగిసింది. ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు టెట్ ధరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సారి టెట్ కు పేపర్ 1కు 32,779 మంది, పేపర్ 2 కు 86,305 మంది, రెండు పేపర్లకు కలిపి 17,334 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,36,418 ధరఖాస్తుల్లో 28, 149 మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లేదా ఫోటో వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ఈసారి దరఖాస్తుల్లో మొత్తం 1.36 లక్షల దరఖాస్తుల్లో 28,149 దరఖాస్తులు సర్వీస్‌లో ఉన్న టీచర్లవే కావడం గమనార్హం. ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అనే నిబంధన ఉన్న నేపథ్యంలో వీరు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్ సమాచారం కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story