- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీ-సెట్ 2026 ఫలితాలు విడుదల
టీజీ-సెట్ 2026 ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విడుదల చేసారు.

దిశ, తెలంగాణ బ్యూరో : టీజీ-సెట్ 2026 ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ భవనంలో ఆన్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటిడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటిబిసిడబ్ల్యూఆర్ఈఐఎస్ మరియు టీఆర్ఈఐఎస్ సంస్థల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీ కోసం టీజీసెట్–2026ను నిర్వహించారు. మొత్తం 635 విద్యాసంస్థల్లో 51,284 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 22, 2026న రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 1,82,061 మంది అభ్యర్థుల్లో 1,72,913 మంది (95%) హాజరయ్యారు. 100 మార్కులకు గాను గరిష్ట మార్కులు 98 వచ్చాయి. కాగా, 5వ తరగతి ఫేజ్–I లో మొత్తం 51,284 సీట్లకు గాను 47,381 సీట్లను నింపారు. వీరిలో టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యార్థులు 16,959 మంది విద్యార్థులు, టీజీటిడబ్ల్యూఆర్ఈఐఎస్ 6501 మంది విద్యార్ధులు, ఎంజేపీటిబిసిడబ్ల్యూఆర్ఈఐఎస్ 20,963 మంది విద్యార్థులు, టీఆర్ఈఐఎస్ 2,958 మంది విద్యార్థులున్నారు.
ఎంపికైన అభ్యర్థులు మార్చి 25 నుండి ఏప్రిల్ 15, 2026 మధ్య తమకు కేటాయించిన పాఠశాలల్లో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని అధికారులు తెలిపారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశానికి నోటీఫికేషన్ ను గతేడాది డిసెంబర్ 11న విడుదల కాగా, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు గతేడాది డిసెంబర్ 11 నుంచి ప్రారంభమై జనవరి 25వ తేదీ వరకూ స్వీకరించారు. 5వ తరగతికి మొత్తం దరఖాస్తులు 79,101 వచ్చాయి. ఫలితాలను అధికారులు వెబ్ సైటులో పొందుపర్చారు. ఫలితాలను విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను విడదల చేసిన అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పారదర్శకంగా మరియు క్రమబద్ధంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించి ఫలితాలను ప్రకటించామని, మధ్యవర్తులు లేదా దళారులు ఏ విధంగానూ అనుమతించబడరని, ప్రవేశ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక శాఖతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అవి పరిష్కారం కానున్నాయని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం వేతనాలను క్రమబద్ధీకరించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, టీజీటిడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి సీతా లక్ష్మి, ఎంజేపీటిబిసిడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి సైదులు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీఎం సంతోష్ లు పాల్గొన్నారు.
సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ పథకం – లబ్ధిదారులకు యూనిట్ల ఆమోద పత్రాలు, చెక్కుల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి
సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్ పథకం కింద 18 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు మొత్తం రూ. 23.44 కోట్ల విలువైన యూనిట్లకు ఆమోద పత్రాలు మరియు రూ. 8.16 కోట్ల సబ్సిడీ చెక్కులు మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గిరిజన పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గిరిజన పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాల పొందేందుకు సహకారం అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Tags
- TG-SET 2026






