రేపటి నుండి టీజీ ఈసెట్ దరఖాస్తులు ప్రారంభం

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈసెట్ ధరఖాస్తులు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

రేపటి నుండి టీజీ ఈసెట్ దరఖాస్తులు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈసెట్ ధరఖాస్తులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించేర ఈ పరీక్షకు సంబంధించి ఈ నెల 9 న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కానుంది. ఏప్రిల్ 18 వరకు ఆలస్య రుసుము లేకుండా ధరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో మే 15 న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500, ఇతర అభ్యర్థులందరికీ రూ. 900 గా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ecet.tgche.ac.in ను సందర్శించవచ్చు లేదా 8179979584 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Next Story