- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు : పట్టించుకోని ఎంఈఓ
ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు, దుస్తులు విక్రయిస్తున్న క్షత్రియ పాఠశాలను సీజ్ చేయాలని కోరుతూ క్షత్రియ పాఠశాల ఎదుట పీడీఎస్‌యూ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు.

దిశ, ఆర్మూర్ : ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు, దుస్తులు విక్రయిస్తున్న క్షత్రియ పాఠశాలను సీజ్ చేయాలని కోరుతూ క్షత్రియ పాఠశాల ఎదుట పీడీఎస్‌యూ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్, జిల్లా కార్యదర్శి జి. సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, విద్యాశాఖ అధికారులు గానీ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని క్షత్రియ పాఠశాల ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నప్పటికీ స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. క్షత్రియ పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారి వ్యక్తిగత అండదండలు అందిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై మండల విద్యాశాఖ అధికారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,500 చొప్పున "మేథ్ యాప్" పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులకు అవసరం లేని పుస్తకాలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని అన్నారు. అలాగే, లేని ర్యాంకులు, మార్కులు చూపించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం సరైంది కాదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, విద్య పేరుతో వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని క్షత్రియ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎస్. దుర్గాప్రసాద్, ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి. నిఖిల్, ప్రధాన కార్యదర్శి రాజు, నాయకులు సిద్ధూ, వెంకటేష్, భూమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.






