- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాతంపల్లి, ఖానాపూర్ మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ
ఏప్రిల్ 4న ఖానాపూర్, క్యాతంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు! ఆదిలాబాద్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ. గడ్డం వివేక్, బాల్క సుమన్ మధ్య పట్టుదల పోరు.

దిశ ప్రతినిధి నిర్మల్/ఖానాపూర్: పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరగా... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పురపాలక సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు పూర్తి కాలేదు. మంచిర్యాల జిల్లాలోని క్యాతంపల్లి మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తుండగా... తాజాగా నాలుగో తేదీన ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
రెండు చోట్ల ఉత్కంఠ..
అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు మున్సిపాలిటీలలో ఆశించిన ఫలితాలు రాలేవు. కౌన్సిలర్ స్థానాలు అధికార పార్టీ కన్నా ఎక్కువగా ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. ఖానాపూర్ లో కాంగ్రెస్ (ఇండిపెండెంట్ తో కలిపి) బీజేపీ, బీఆర్ఎస్ సమానంగా ఉన్నాయి. క్యాతన్ పల్లి లో మెజారిటీ స్థానాలు గులాబీ పార్టీకి ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ అక్కడ బహిరంగంగా ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నది. దీంతో గులాబీ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ అక్కడ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు.
ఎలాగైనా ఆ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవాలని పట్టుతో ఉన్నారు. ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ ను తన వర్గంలోకి చేర్చుకోగా... మరో ఇద్దరు తమ వెంట వస్తే మున్సిపాలిటీ కైవసం చేసుకోవచ్చు అన్న ఆలోచనతో బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఖానాపూర్‌లోను 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ శాసనసభ్యుడు బొజ్జు పటేల్ ఓటుతో ఐదు ఓట్ల సంఖ్య ఉంది. ఇక్కడ మరో ఇద్దరి అవసరం పడుతుంది. దీంతో ఆయన కూడా తన నియోజకవర్గంలో ఉన్న పురపాలక సంఘం కావడంతో అక్కడ జెండా ఎగురవేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇతర పార్టీలు అదే పట్టుతో..
క్యాతన్ పల్లి లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న పట్టుదల గట్టిగా కనిపిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ విషయంలో గట్టిగా కొట్లాడుతున్నారు ఇదే వ్యవహారంలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. పట్టు సడలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సిపిఐ తో కలిసి అధికారంలోకి వచ్చేందుకు ఆయన విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం ఈ పరిణామాలు చర్చకు దారి తీసాయి ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
ఇక ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ ఎలాగైనా ఆ స్థానాన్ని పదుల పరచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పరోక్షంగా బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నది. తన భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా జాన్సన్ నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో నాలుగో తేదీన జరగనున్న ఈ రెండు మున్సిపాలిటీల ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి.






