సీఎం పర్యటన వేళ ఉద్రిక్తత.. గోకారం -ఎర్రవెల్లి ముంపు బాధితుల ముందస్తు అరెస్ట్

by Jakkula.Mamatha |

సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా మిడ్జిల్ సభ సందర్భంగా గోకారం -ఎర్రవెల్లి రిజర్వాయర్ ముంపు బాధితుల ముందు అరెస్ట్ చేశారు.

సీఎం పర్యటన వేళ ఉద్రిక్తత.. గోకారం -ఎర్రవెల్లి ముంపు బాధితుల ముందస్తు  అరెస్ట్
X

దిశ, చారకొండ: సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా మిడ్జిల్ సభ సందర్భంగా గోకారం -ఎర్రవెల్లి రిజర్వాయర్ ముంపు బాధితుల ముందు అరెస్ట్ చేశారు. మా భూములు మాకు కావాలి -మా ఊరు మాకు దక్కాలి అని డిమాండ్ చేస్తూ గత గ్రామ పంచాయతీ ఎన్నికలు బహిష్కరించడంతో పాటు 215 రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి సభ సందర్భంగా ముంపు బాధితుడు ఏలకుల ప్రకాష్‌‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ముంపు బాధితులైన ఎర్రవెల్లి, ఎర్రవెల్లి తండా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇన్ని రోజులుగా శాంతియుత నిరసనలో భాగంగా దీక్షలు చేస్తున్న ఏ ఒక్క ప్రభుత్వ అధికారి, ప్రజా ప్రతినిధి మమ్ములను పరమర్శించకపోగా ముఖ్యమంత్రి సభ కోసం అరెస్ట్ లు చేస్తారా అని గ్రామస్తులు పోలీసులను నిలదీస్తున్నారు. నిరసనలు కూడా చేయకుండా నిరోధించే నియంత్రించడం దారుణం అని వారు వాపోతున్నారు. ఆర్ అండ్ ఆర్ రద్దు చేసి మాకు న్యాయం చేయకుంటే ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

Next Story