సీఎం రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసలు

by Malleboina Mahesh |

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు.. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మీ ప్రయాణం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం అని ప్రశంస!

సీఎం రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడుతూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. 2006వ సంవత్సరంలో స్థానిక సంస్థల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. జెడ్పీటీసీ (ZPTC) స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో కొనసాగడం ప్రతి యువ నాయకుడికి ఎంతో స్ఫూర్తిదాయకమని మంత్రి పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి చేసిన నిరంతర పోరాటం, ఆయన చూపిన పట్టుదల, తిరుగులేని నాయకత్వ లక్షణాలు మరియు తెలంగాణ అభివృద్ధిపై ఆయనకున్న దూరదృష్టి నేడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమాంతరంగా సమన్వయం చేసుకుంటూ తెలంగాణ దేశానికే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రికి మంత్రి మరోసారి తన అభినందనలు తెలియజేశారు.

Next Story