ములుగులో దారుణం.. జాకారం సమీపంలో రాజాపేట వ్యక్తి హత్య!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-04 05:15:01  IST  )

రాజాపేటకు చెందిన వ్యక్తి ములుగు జిల్లా కేంద్రం జాకారం గ్రామ సమీపంలో హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ములుగులో దారుణం.. జాకారం సమీపంలో రాజాపేట వ్యక్తి హత్య!
X

దిశ,రాజాపేట: రాజాపేటకు చెందిన వ్యక్తి ములుగు జిల్లా కేంద్రం జాకారం గ్రామ సమీపంలో హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన సిరిపంగ నరసింహులు ఈనెల 23వ తేదీన జాకారం గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహం పోలీసులు కనుగొన్నారు. కాగా వ్యక్తి చిరునామా పేరు తెలియకపోవడంతో 23వ తేదీ నుంచి వివరాల కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశారు.

మృతదేహం మరింత కుళ్లిపోయే పరిస్థితి నెలకొనడంతో నాలుగు రోజుల తర్వాత పోలీసులు ఖననం చేశారు. మృతుని జేబులో లభించిన బీడీ కట్టపై రాజాపేట ముద్రించి ఉండడంతో ఎట్టకేలకు రాజాపేటకు చెందిన సిరిపంగ నరసింహులుగా నిర్ధారణకు వచ్చారు. రాజాపేట ఎస్సై లింగారెడ్డి సహకారంతో హత్యకు కారణాలు, మిస్టరీ చేదించే కార్యక్రమాన్ని ములుగు సీఐ సురేష్ కుమార్ వేగవంతం చేశారు. సిరిపంగ నరసింహులు హత్యకు కారణాలను 24 గంటల్లో బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై రాజపేట సర్పంచ్ కోయ మధు, ఉపసర్పంచ్ నమిల కేదారి గౌడ్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుర్రం నర్సింలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగు సిద్ధులు, ఎర్ర గోకుల సత్తయ్య, డప్పురాజు పలువురు నాయకులు ములుగు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Next Story