- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. కృష్ణలంక పీఎస్‌లో కీలక ఆధారాలు లభ్యం
గాదె సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గాదె సాయి కృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్‌లెట్, అనుమానాస్పద మరకలున్న లాఠీతో పాటు ఇతర వస్తువులను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. న్యాయాధికారి సమక్షంలో వాటికి సీల్ వేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. లభ్యమైన ఎముకలు, బూడిద సాయికృష్ణవేనో కాదో నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ తల్లి డీఎన్‌ఏ నమూనాలు సేకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజును మరింత విచారించేందుకు కోర్టు సిట్‌కు తొమ్మిది రోజుల కస్టడీ మంజూరు చేసింది. మరోవైపు, సాయికృష్ణ మృతిపై జ్యుడీషియల్ విచారణ కోరుతూ ఆయన తల్లి దాఖలు చేసిన పిటిషన్‌కు సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసినందున ప్రత్యేక న్యాయ విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొంది. నాగరాజు విచారణకు రాజమహేంద్రవరం జైలు అధికారులు ఏర్పాట్లు చేయగా, విజయవాడలో విచారణ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది.






