లై డిటెక్టర్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్

by Muthe.Rajitha |

మహారాష్ట్రలోని పుణెలో సంచలనం సృష్టించిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

లై డిటెక్టర్ టెస్టుకు నిరాకరించిన సియా, చేతన్
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పుణెలో సంచలనం సృష్టించిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు, నిజాలను రాబట్టేందుకు నిందితులకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఇందుకు నిందితులు నిరాకరించడంతో కోర్టు పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసుల దరఖాస్తుపై స్పందించిన న్యాయస్థానం.. మొదట నిందితులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ పరీక్షకు తాము సిద్ధంగా లేమని ప్రధాన నిందితులు సియా, చేతన్ కోర్టుకు స్పష్టం చేశారు.

నిందితుల సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. వారి సమ్మతి, అనుమతి లేకుండా ఎలాంటి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిందితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప, ఇటువంటి పరీక్షలకు చట్టబద్ధంగా అనుమతించలేమని కోర్టు పేర్కొంది. ఇదిలావుండగా, ఈ కేసులో నిందితులు సియా, చేతన్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు వారిని కఠిన భద్రత నడుమ పుణెలోని ప్రముఖ యరవాడ సెంట్రల్ జైల్‌కు తరలించారు. కేతన్ అగర్వాల్ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story