- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని షాక్ కు గురి చేసింది. ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకసారి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సామూహిక ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలుగా తెలుస్తుంది. ఈ సమాచారం అందున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Next Story






