చినుకు పడితే చాలు చిత్తడే..!

by Jakkula.Mamatha |

గత పదేళ్ల నుంచి చినుకు పడితే చాలు చిత్తడే అంటున్న వాహనదారులు.

చినుకు పడితే చాలు చిత్తడే..!
X

దిశ, రాయికోడ్: గత పదేళ్ల నుంచి చినుకు పడితే చాలు చిత్తడే అంటున్న వాహనదారులు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్ర పరిధిలోని షాపూర్, పాంపాడ్ గ్రామీణ పట్టణ ప్రాంతాలకు వెళ్లే ఒకే ఒక్క ప్రధాన రహదారి అలాంటి రహదారి పై గత పదేళ్ల నుంచి వాహనదారులు ప్రయాణం చేయలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనులను చేపట్టేందుకు 2.63 కోట్లు నిధులు మంజూరు చేశామని రెండేళ్ల క్రితం అధికారులు చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు వాహనాదారులు నానా తంటాలు పడుతున్నారు. పలు మార్లు ఆ ప్రాంతాల యువకులు రోడ్డు నిర్మాణం కొరకు నాయకులను కలిసిన ప్రయోజనం లేకుండా పోతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డుపై దృష్టి సారించి రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story