- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్‌నగర్‌లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 85.56 శాతం పూర్తి:ఆర్డీవో సరిత
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియలో షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వేగంగా ముందుకు సాగుతోందని షాద్ నగర్ ఆర్డిఓ సరిత తెలిపారు.

దిశ, షాద్ నగర్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియలో షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వేగంగా ముందుకు సాగుతోందని షాద్ నగర్ ఆర్డిఓ సరిత తెలిపారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శనివారం 'దిశ' ప్రతినిధి కి ఎస్ఐఆర్ ప్రక్రియ వివరాలను ఆర్డీవో వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 2,44,426 మంది ఓటర్లకు పంపిణీ చేయాల్సిన ఎన్యుమరేషన్ ఫారాల్లో 2,09,130 పంపిణీ చేయగా, శుక్రవారం సాయంత్రం వరకు 85.56 శాతం పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. అలాగే 5,962 ఫారాలను డిజిటైజ్ చేయగా, అది 2.44 శాతంగా నమోదైందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయి గణాంకాల ప్రకారం రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 85.15 శాతం పంపిణీతో షాద్ నగర్ అగ్రస్థానంలో నిలిచిందని, చెవెళ్ల (82.24%), కల్వకుర్తి (83.46%) నియోజకవర్గాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లా మొత్తంగా 36,99,743 మంది ఓటర్లలో 23,41,314 మందికి ఫారాలు పంపిణీ చేయగా, జిల్లా సగటు 63.28 శాతంగా నమోదైందని వివరించారు. డిజిటైజేషన్ జిల్లా వ్యాప్తంగా 1.19 శాతంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా పరిశీలిస్తే జిల్లేడు చౌదర్‌గూడ మండలం 95.99 శాతం ఫారాల పంపిణీతో మొదటి స్థానంలో నిలిచిందని, కేశంపేట 95.19%, కొందుర్గు 94.52%, నందిగామ87.61%, ఫరూఖ్‌నగర్ రూరల్ 85.12%, కొత్తూర్ 84.28%, మండలాలు ఉన్నాయని, షాద్ నగర్ మున్సిపాలిటీలో 70.08 శాతం మాత్రమే పంపిణీ పూర్తి కావడంతో మిగతా ప్రాంతాలతో పోలిస్తే కొంత వెనుకబడి ఉందని అన్నారు.
డిజిటైజేషన్ పరంగా ఫరూఖ్‌నగర్ రూరల్ 1,621, కేశంపేట 1,374, షాద్ నగర్ మున్సిపాలిటీ 1,052 కొత్తూర్ 1,006 ఫారాలను డిజిటైజేషన్ చేశారని తెలిపారు. ఎన్నికల అధికారులు మిగిలిన ఫారాల పంపిణీతో పాటు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్డీవో ఆదేశాలను జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటరు జాబితా సవరణ పనులు మరింత వేగంగా కొనసాగనున్నాయని ఆర్డీవో సరిత పేర్కొన్నారు.






