- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్లూరులో విషాదం.. కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ,కల్లూరు: ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో తన కుమారుడు కొత్తపల్లి కిరణ్ కుమార్(30)ను సమీపంలోని బెల్ట్ షాపుకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం ఇంటికి తీసుకువచ్చి ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో కిరణ్ కుమార్ తల వెనుక భాగంలో తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుమారుడు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం నిందితుడు సీతారాములు తన ఆటోలో అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. మృతుడు కిరణ్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు






