- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు ఉంటే కేవలం 5 వేల పోస్టులకే అనుమతి ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమే: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 5 వేల ఉద్యోగాల భర్తీకి మాత్రమే ప్రభుత్వం నిర్ణయించడంతో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ తన ట్వీట్ లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం సుమారు 20,000 ఖాళీలు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5,000 పోస్టుల భర్తీకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేయడమేనని ఆయన మండిపడ్డారు.
రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నమ్మబలికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తీరా అధికార పీఠం దక్కించుకున్నాక, ఇప్పుడు పోస్టుల భర్తీ విషయంలో కోతలు విధిస్తూ నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న పోలీస్ అభ్యర్థుల పట్ల ప్రభుత్వం అత్యంత అహంకారంగా వ్యవహరిస్తోందని, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు.
పోలీస్ ఉద్యోగార్థుల న్యాయమైన డిమాండ్లన్నింటికీ భారతీయ జనతా పార్టీ (BJP) పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని.. వారికి రావాల్సిన న్యాయమైన హక్కులు, ఉద్యోగాలు నెరవేరే వరకు ప్రభుత్వంపై ఎంత దూరమైనా వెళ్తామని, వారి తరఫున రాజీలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.






