- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'లెనిన్' కోసం ఇద్దరు స్టార్ హీరోలు.. జోరు చూపిస్తున్న అఖిల్
'లెనిన్' ప్రమోషన్లలో భాగంగా అఖిల్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ఇప్పటికే జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్లను మరింత గ్రాండ్‌గా నిర్వహించేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున కూడా పాల్గొనే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.






