- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త పేర్లు ఇచ్చేది లేదు..TRS పేరుపై న్యాయపోరాటానికి సిద్ధం: కవిత
కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుపై ఈసీ షాక్ ఇచ్చింది. పార్టీ పేరు మార్చుకోవాలని లేఖ రాసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశంలో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదు అవుతున్నాయి. 'తెలంగాణ రక్షణ సేన (TRS)' పేరుతో ప్రజల్లోకి వెళ్తోన్న కవితకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది. తన పార్టీ పేరును 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకోగా ఈ పేరుపై సుమారు వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సర్పించాలని ఈసీ తాజాగా కవితకు లేఖ రాసింది. ప్రత్యామ్నాయ పేర్లు 15 రోజుల్లోగా తమకు పంపకపోతే పార్టీ నమోదు దరఖాస్తును ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా మూసివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు జూన్ 23న కవితకు సీఈసీ పోస్టు ద్వారా లేఖను పంపించినట్లు సమాచారం.
న్యాయపోరాటం చేస్తాం: కవిత
ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ సమాధానం ఇచ్చారు. అయితే ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఈ విషయంలో న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కవిత తెలిపారు. అయితే బీఆర్ఎస్ ను విభేదించిన కవిత సొంత పార్టీని స్థాపించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న వేళ పార్టీ విషయంలో ఎదురవుతున్న చిక్కులు కవిత రాజకీయ భవిష్యత్‍పై చర్చకు దారి తీస్తోంది. నిజానికి గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే ఐదు పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన(TRS) అని కవిత అనౌన్స్ చేశారు. జెండాను సైతం ఆవిష్కరించారు.






