రేవల్లి మండలంలో వరుస చోరీలు.. భయాందోళనలో ప్రజలు

by Jakkula.Mamatha |

రేవల్లి మండలంలోని గ్రామాల్లో రోడ్డుకు సమీపంలో ఉండే వ్యవసాయ బోరుబావుల మోటర్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని వ్యక్తులు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో గ్రామాల్లో అభద్రతా భావం నెలకొంది.

రేవల్లి మండలంలో వరుస చోరీలు.. భయాందోళనలో ప్రజలు
X

దిశ, రేవల్లి: రేవల్లి మండలంలోని గ్రామాల్లో రోడ్డుకు సమీపంలో ఉండే వ్యవసాయ బోరుబావుల మోటర్లు, స్టార్టర్లు, కేబుల్ వైర్లు లక్ష్యంగా చేసుకొని గుర్తుతెలియని వ్యక్తులు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో గ్రామాల్లో అభద్రతా భావం నెలకొంది. రాత్రి వేళల్లో దొంగలు స్వైర విహారం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రేవల్లి గ్రామ సర్పంచ్ రాజయ్య, ఇదే గ్రామానికి చెందిన బిచ్చిరెడ్డి, వడ్డెమాన్ రవి, తెలుగు తీర్పతయ్యలకు చెందిన వ్యవసాయ బోరు బావుల వద్ద ఉన్న సుమారు 400 మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లను దుండగులు అపహరించారు. ఈ ఘటనతో రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లడంతో పాటు సాగునీటి పారుదలకు ఆటంకం నెలకొంది.

అదే విధంగా కొంకలపల్లి గ్రామానికి చెందిన గజ్జి నాగేంద్ర మేకల మందలో ఉన్న విలువైన మేకపోతును దుండగులు చోరీ చేశారు. ఇదే గ్రామంలోని దేవాలయం పక్కన భక్తుల అవసరాల నిమిత్తం బోరుబావిలో అమర్చిన 2 హెచ్‌పీ మోటార్ మరియు కేబుల్ ను కేబుల్ సుమారు 15 రోజుల క్రితం చోరీకి గురికాగా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులు పట్టుబడలేదు. ఇక పాఠాతాండకు చెందిన అంగోత్ గణేష్ బోరుబావి వద్ద ఉన్న స్టార్టర్, కేబుల్‌ను కూడా దుండగులు అపహరించడం స్థానిక రైతుల్లో మరింత ఆందోళనకు దారితీసింది. ఒకే మండలంలో వరుసగా ఇలాంటి చోరీలు జరుగుతుండటంతో ప్రజలు రాత్రివేళల్లో భయంతో గడుపుతున్నారు.

ప్రత్యేక నిఘా పెంచాలి..

మండలంలోని పలు గ్రామాల్లో వరుస చోరీలు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత కట్టుదిట్టం చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల వ్యవసాయ బోరుబావుల కేబుల్ వైర్లు, స్టార్టర్లు, పశువుల చోరీలు పెరగడం రైతులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల రాత్రి గస్తీ పెంచడం, సీసీ కెమెరాల ఏర్పాటు, గ్రామస్థులతో సమన్వయం కల్పించడం ద్వారా చోరీలను అరికట్టవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో భరోసా కల్పించేలా పోలీసులు తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ రజితను వివరణ కోరగా తాను స్థానికంగా లేనందున రేవల్లికి వచ్చిన తర్వాత స్పందిస్తానని తెలిపారు.

Next Story