నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ!

by Malleboina Mahesh |

తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మరో 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్!

నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ!
X

దిశ, వెబ్ డెస్క్: జూన్ నెలలో మందకొడిగా సాగిన రుతుపవనాల కారణంగా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పుంజుకున్నాయి. ఈ రోజు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో శనివారం (జూలై 4, 2026) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తతను సూచిస్తూ ‘ఆరెంజ్ అలర్ట్’ (Orange Alert) జారీ చేసింది.

మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్

అతిభారీ వర్షాల హెచ్చరికలతో పాటు రాష్ట్రంలోని మరో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) జారీ చేశారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

Next Story