- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురానాపూల్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత: రెండు వర్గాల ఘర్షణ, పోలీసుల లాఠీఛార్జ్
హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో రెండు వర్గాల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్త పెద్ద ఘర్షణకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలోని పురానాపూల్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో రెండు వర్గాల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్త పెద్ద ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన తోపులాట, రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ఈ ఘర్షణల నేపథ్యంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు పురానాపూల్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా బహదూర్ పుర నుండి పురానాపూల్ వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు పూర్తిగా బ్లాక్ చేశారు. వాహనదారులను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అలాగే కొత్తవారిని ఆ ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మళ్లీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి నిశీతంగా గమనిస్తున్నారు. స్థానికులు సంయమనం పాటించాలని, వదంతులు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా రెండు వర్గాల ఘర్షణకు దారి తీసిన వివాదం ఎంటనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.






