- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్కేసర్లో ఉద్రిక్తత
పట్టణ కేంద్రంలోని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ తో బుధవారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

దిశ, ఘట్కేసర్ : పట్టణ కేంద్రంలోని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ తో బుధవారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఘట్కేసర్ యువత, స్థానిక ప్రజలు సమావేశంలో వంతెన నిర్మాణంపై చర్చిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటా మాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. వంతెన నిర్మాణ కార్మికులు అందుబాటులో లేక వంతెన నిర్మాణం ఆలస్యం అవుతుందని, కాంట్రాక్టర్ కు రావలసిన బిల్లు దాదాపు రూ.మూడు కోట్ల రూపాయలు ఇటీవల ప్రభుత్వం నుంచి ఇప్పించామని, మిగతా రూ.ఆరు కోట్ల నిధులు కూడా తానే ఇప్పిస్తానని అనడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఇలాంటి బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయొద్దని విరుచుకుపడ్డాడు. ఓ దశలో సహనాన్ని కోల్పోయిన ఇద్దరు పత్రికల్లో రాయలేని బూతులతో ఒకరినొకరు ధూషించుకున్నారు.
ఆర్ అండ్ బి ఈఈ ని నిలదీసిన స్థానికులు...
వంతెన నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆర్ అండ్ బి ఈఈ రమేష్ ను స్థానిక ప్రజలు, యువకులు చుట్టుముట్టారు. వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో అధికారికంగా ప్రకటిస్తే గానీ ఇక్కడినుంచి వెళ్లాలని పట్టుబట్టారు. నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని ఈఈ హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.
రాజకీయ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం పాటు పడాలి...
దాదాపు 18 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న వంతెన కోసం గత నాలుగు ఏళ్లుగా స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు, ఘట్కేసర్ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా రాజకీయాలు పార్టీల నాయకులు అభివృద్ధికి పాటుపడాలి కానీ ఆధిపత్యం కోసం రోడ్లపైకి వచ్చి రాద్దాంతం చేయడం సిగ్గుచేటని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైతే అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి వంతెన నిర్మాణం పూర్తయ్యేలా కార్యచరణ రూపొందించాలని సూచిస్తున్నారు.






