ఆలూర్‌లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అధికారులు

by Taduka Kalyani |

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశాల మేరకు ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆలూర్‌లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అధికారులు
X

దిశ, ఆలూర్ : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశాల మేరకు ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాలను పరిశీలించి, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తీరు గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషకాహారం అందేలా అన్ని పాఠశాలల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి , ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొన్నారు.

Next Story