- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
by Taduka Kalyani |
మండల పరిధిలోని జమీందారు బంజర గ్రామ శివారులో బుధవారం గుర్తు తెలియని ఒక మహిళ (సుమారు 35 ఏళ్లు) మృతదేహం లభ్యమైంది.

X
దిశ, దమ్మపేట:- మండల పరిధిలోని జమీందారు బంజర గ్రామ శివారులో బుధవారం గుర్తు తెలియని ఒక మహిళ (సుమారు 35 ఏళ్లు) మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... బుధవారం ఉదయం 11 గంటల సమయంలో గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వెంటనే దమ్మపేట ఎస్ఐ రాజేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన మహిళ గత పది రోజులుగా మతిస్థిమితం లేకుండా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందని స్థానికులు పోలీసులకు తెలిపారు.గ్రామ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.
Next Story






