- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంజేపీటీబీసీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఉద్రిక్తత
తనికెళ్ల సమీపంలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(ఎంజేపీటీబీసి)వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

దిశ, కొణిజర్ల : తనికెళ్ల సమీపంలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(ఎంజేపీటీబీసి)వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొణిజర్లకు చెందిన చింతల ఉదయ్ కిరణ్ పాఠశాలలో ఈ ఏడాది 9వ తరగతి చదువుతున్నాడు. 14 తారీకు సాయంత్రం ఐదు గంటలకు రోల్ కాల్ సమయంలో విద్యార్థులంతా బయటకు వచ్చారు. ఇదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్న మైనారిటీ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి తనకు అసభ్యకరమైన సైగలు చేస్తున్నాడని పీఈటీ భాస్కరకు ఉదయ్ కిరణ్ చెప్పాడు. దీంతో పీఈటి భాస్కర్ ఏమి జరిగిందో తెలుసుకోకుండానే ఉదయ్ కిరణ్ పై దాడి చేసి గాయపరిచాడు. జరిగిన విషయం పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి దృష్టికి వెళ్ళింది. సంఘటన పై వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏకపక్షంగా వ్యవహరించినట్టు సమాచారం.
విద్యార్థి పై దాడి చేసిన పీఈటీ పై చర్యలు తీసుకోకుండా విద్యార్థి దుస్తులు పాఠ్య పుస్తకాలు తీసుకొని ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. తల్లి దండ్రులకు ఫోన్ చేసి పిలిపించి మీ పిల్లవాడి ప్రవర్తన బాగాలేదు ఇంటికి తీసుకెళ్లండి అని సూచించారు. దీంతో అసలేం జరిగిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తమ విద్యార్థి తప్పేమీ లేదని తెలుసుకొని తమ కుమారుడి పై దాడి చేసి గాయపరచిన పీఈటీ భాస్కర్ ని సస్పెండ్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళనకు పూనుకున్నారు. సస్పెండ్ చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ భీష్మంచి కూర్చున్నారు. దీంతో పాఠశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ నాగమణి ఆర్సీఓ దృష్టికి తీసుకెళ్లారు. పీఈటి గతంలో కూడా ఓ విద్యార్థి పై దాడి చేసి గాయపరిచినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల విధులకు సక్రమంగా హాజరు కాడని విద్యార్థులు పేర్కొన్నారు. అయినా అతని పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.
ఆర్సీవోకు ఫిర్యాదు చేసాం : ప్రిన్సిపల్ నాగమణి
ఈ విషయం పై ప్రిన్సిపాల్ నాగమణిని వివరణ కోరగా విద్యార్థి పై పీఈటీ దాడి చేసి గాయపరిచిన మాట వాస్తవమేనన్నారు. సంఘటన పై ఆర్సిఓకు నివేదిక అందజేశామని సస్పెండ్ చేసే అంశం తమ పరిధిలో లేదన్నారు. గతంలో కూడా ఒక విద్యార్థిని గాయపరిచిన మాట వాస్తవేనన్నారు.






