ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్ళకే?

by Vinod kumar |   (  Updated:2023-06-13 15:10:30  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ - Tennis World No. 1 Ashleigh Barty Retires At 25. Watch Her Tearful Message

ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్ళకే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్, ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ 25 సంవత్సరాలకే టెన్నిస్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేసింది. ఈ సీజన్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ నెగ్గిన యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. అలాగే 41 ఇయర్స్ తర్వాత వింబుల్డన్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ గత సంవత్సరం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నేను భావోద్వేగంతో నిండి ఉన్నాను. టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిండం చాలా కష్టంగా ఉంది.. అని పేర్కొంది. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ.. తన సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్‌ను ప్రకటించింది.

Next Story