- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్పీడీసీఎల్‌లో టెండర్ల 'గోల్‌మాల్.. రూల్స్ మార్చి అనుచరులకు కట్టబెట్టే ప్లాన్
కరీంనగర్ ఎన్పీడీసీఎల్‌లో టెండర్ల అక్రమాలు! అనుకూల కాంట్రాక్టర్ల కోసం రూల్స్ మార్చిన అధికారులు. సీఎండీకి ఫిర్యాదుల వెల్లువ. టెండర్లు రద్దు చేయాలని డిమాండ్.

దిశ, కరీంనగర్ బ్యూరో: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాల్సిన ఎన్పీడీసీఎల్ ఎస్ అండ్ఈ ఆపరేషన్స్ సర్కిల్ కరీంనగర్ అధికారులు అందుకు తిలోదకాలు ఇస్తున్నారు. అనుకూల కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు సివిల్ ఇంజనీరింగ్ అధికారులు పొందుపరచిన అర్హత ప్రమాణాలను మార్చి టెండర్లు పిలుస్తున్నారు. అందుకు కార్పొరేట్ ఆఫీసులు కేంద్రంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతుండగా అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించి సంస్థ నష్టాల బారిన పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఎస్ అండ్ఈ సర్కిల్ వారు పిలిచిన పలు అభివృద్ధి పనుల టెండర్ల లో జరిగిన అవకతవకలపై సీఎండీకి ఫిర్యాదులు వెల్లువెత్తడం ఇక్కడి పరిస్థితికి నిదర్శనం.
అర్హత ప్రమాణాలు మార్చి టెండర్లు
అయినవారికి ఆకుల్లో కాని వారికి కంచంలో అన్న చందంగా తయారైంది ఎన్పీడీసీఎల్ ఎస్ అండ్ఈ ఆపరేషన్స్ సర్కిల్ అదికారుల తీరు. తాజాగా తేది 9-03-2026 నాడు రెండు వీఆర్వో ఆఫీసుల నిర్మాణం సెంట్రల్ స్టోర్ రెనోవేషన్ చేసేందుకు ఎన్పీడీసీఎల్ ఎస్ అండ్ఈ ఆపరేషన్స్ సర్కిల్ కరీంనగర్ పేరున టెండర్లు పిలిచారు. అయితే అందుకు సివిల్ ఇంజనీరింగ్ అధికారులు అర్హత ప్రమాణాలు అంచనా వ్యయాలు నిర్దేశిస్తూ అధికారులకు సమర్పిస్తారు. అలా సమర్పించిన ప్రకారం అధికారులను టెండర్లు పిలవాలి.
కానీ ఎన్పీడీసీఎల్ ఎస్అండ్ఈ ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కరీంనగర్ లో సాంకేతిక విభాగం వారు అవి మార్చి తమ అనుకూలురైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు అర్హత ప్రమాణాలను మార్చి టెండర్లు నిర్వహించడం వివాదస్పదంగా మారుతుంది. అయితే ఇదంతా ఇక్కడ సర్వసాధారణమే అనే వాదన లేకపోలేదు. ఇలా కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకోసం సంస్థకు నష్టాలు వాటిల్లేలా అధికారులు వ్యవహరించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల తీరుపై సీఎండీకి ఫిర్యాదులు
కాంట్రాక్టు పనుల టెండర్లలో అర్హత ప్రమాణాలు మార్చి కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా అధికారులు వ్యవహరించడం వివాదస్పదంగా మారింది. అధికారుల తీరును నిరసిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కార్పొరేట్ కార్యాలయాలు కేంద్రంగా లక్షల రూపాయలు చేతులు మారడంతో సంస్థకు నష్టం వాటిల్లే విధంగా అర్హత ప్రమాణాలు మార్చడంతో సంస్థకు నష్టం వాటిల్లడంతో పాటు పనుల్లో అర్హత గల కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా పోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి
టెండర్లను రద్దు పరచాలి
టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హత ప్రమాణాల్ని అనుకూలంగా మార్చి పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు పరచాలని, మళ్లీ టెండర్లను పిలిచి నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు






