రిపబ్లిక్ డే వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత

by Muthe.Rajitha |   (  Updated:2026-01-26 00:53:49  IST  )

రిపబ్లిక్ డే రోజున దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

రిపబ్లిక్ డే వేళ కలకలం.. 10 వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : రిపబ్లిక్ డే రోజున దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజస్థాన్ ఎటిఎస్, స్థానిక పోలీసులు కలిసి చేసిన సంయుక్త ఆపరేషన్‌లో భారీ పేలుడు పదార్థాలు పట్టుబడటం ఒక్కసారిగా సంచలనం రేపింది. జైపూర్ దగ్గర ఉన్న అంబాబరి ప్రాంతంలోని ఒక గోదాంతోపాటు మరో ఇంటి ఆవరణలో దాచిన సుమారు 10 వేల కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. గణతంత్య్ర దినోత్సవ వేడుకలు, పరేడ్‌ల సమయంలో పెద్ద దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా.. వారిలో ఒకరికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా రెండు రోజుల నిఘా అనంతరం ఆదివారం రాత్రి ఈ దాడి చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ సక్సెస్ కావడంతో దేశం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ అన్నారు.

ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోలీస్ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు. కేసును NIA విచారణ చేస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికాగా.. జైపూర్, ఉదయ్‌పూర్ వంటి నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే కాకుండా.. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Next Story