బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. పదిమంది దుర్మరణం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-05 13:35:36  IST  )

మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది.

బొగ్గు గనిలో ఘోర ప్రమాదం..  పదిమంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మేఘాలయ(Meghalaya)లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో భారీ పేలుడు(Coal Mine Explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో పదిమంది కూలీలు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. గురువారం గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. దాంతో కూలీలంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి పది మందికి పైగా మృతిచెందినట్లు తెలిపారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలోని మ్యన్‌సింగ్‌హట్-థాంగ్‌స్కో ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో ఈ ప్రమాదం సంభవించింది. కూలీలంతా అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో గతంలో, 2025 డిసెంబరు 23న కూడా ఇలాంటి డైనమైట్ పేలుడే సంభవించింది. ఆ ప్రమాదంలో ఇద్దరు గని కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్ల జరుగుతున్న రెండో పెద్ద ఘటనగా అధికారులు చెబుతున్నారు.

Next Story