మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ.. పది మందిపై కేసు

by S Gopi |   (  Updated:2022-03-19 13:57:31  IST  )

దిశ, పరిగి: మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ జరిగి పది మంది ఒకరిపై..Ten people attack each other for the chair at Parigi

మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ.. పది మందిపై కేసు
X

దిశ, పరిగి: మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ జరిగి పది మంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరిగి ఎస్ఐ పి. విఠల్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి మున్సిపల్ పరిధిలోని వీరభ్రద వైన్స్ పక్కనే గల పర్మిట్ రూంలో శుక్రవారం కుర్చీ కోసం గొడవపడ్డారు. పరిగి బాలాజీ నగర్ కు చెందిన బొబ్బిలి భాస్కర్, రఘు బాబు, బాబు, ముష్టిపల్లి సంగమేశ్వర్లు, గుడిసె నవీన్, కొత్త బాలరాజు, బాలానగర్​ రాజు, రాజు, తప్ప నారాయణ తాగిన మైకంలో మేం కూర్చున్న కుర్చీని ఎందుకు లాక్కున్నారంటూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ కొట్టుకున్నారు. పర్మిట్​రూం నుంచి ఈ గొడవ కాస్త హైవే 163పైకి వచ్చింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు. నిందితులను పరిగి తహశీల్దార్​విద్యాసాగర్​రెడ్డి ముందు హాజరు పరిచి బైండోవర్​చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story