- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బింబిసార' ఇండస్ట్రీకి ఆక్సిజన్ అందించింది : టీఎఫ్‌పీసీ
దిశ, సినిమా : తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. తాజాగా విడుదలైన 'బింబిసార', 'సీతారామg' చిత్రాలపై ప్రశంసలు కురిపిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

దిశ, సినిమా : తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. తాజాగా విడుదలైన 'బింబిసార', 'సీతారామం' చిత్రాలపై ప్రశంసలు కురిపిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార'లో అద్భుత నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడంటూ పొగిడేస్తూ.. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఇండస్ట్రీకి ఈ విజయం ఊరటనిచ్చిందని పేర్కొంది. అలాగే 'సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్టకు మొదటి అవకాశమిచ్చి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేర్చినందుకు ఎన్‌టీఆర్ ఆర్ట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఇక బాలకృష్ణ 'అఖండ'తో పాటు 'వైజయంతి మూవీస్' బ్యానర్‌లో వచ్చిన 'సీతారామం', 'మహానటి', 'జాతి రత్నాలు' తెలుగు చిత్ర పరిశ్రమకు ఆక్సిజన్ అందిచాయని వివరించారు. చివరగా అశ్వనీదత్, స్వప్న దత్, శేషు ప్రియాంక దత్, హను రాఘవపూడితో పాటు ఇండస్ట్రీకి విజయాలు అందిస్తున్న ప్రేక్షకులకు నిర్మాతల మండలి తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.






