TG: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాపం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-03 16:26:10  IST  )

మంథని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చందుపట్ల రాంరెడ్డి, యాకత్ పూర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీల మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

TG: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మృతి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాపం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంథని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చందుపట్ల రాంరెడ్డి, యాకత్ పూర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీల మృతిపట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు గడ్డం ప్రసాద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 1994 నుండి 1999 వరకు తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా చందుపట్ల రాంరెడ్డి ప్రాతినిధ్యం వహించాడు. 2004లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది వరుసగా మూడుసార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు సయ్యద్ అహ్మద్ పాషా. 2018లో యాకుత్‌పురా నుంచి గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పాషా మజ్లిస్ పార్టీ వ్యవస్థాపకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.

Next Story