- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Municipal Elections: జనసేన పార్టీకి టాలీవుడ్ యంగ్ హీరో సపోర్ట్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యచరణ రూపొందించినట్లు ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. తాజాగా జనసేన పార్టీ తరపున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రముఖ తెలుగు యువ హీరో తనీశ్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘‘యువత, మహిళలు, విద్యావంతులు సమాజానికి మంచి చేయాలనే నిబద్ధత కలిగిన వారు ప్రజా ప్రతినిధులు అయితే సమాజం బాగుపడుతుంది. దీనిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు బలంగా నమ్ముతారు. అదే ఆలోచనలతో జనసేన పార్టీలో యువత, మహిళలు, విద్యావంతులకు అవకాశం కల్పించారు. కల్పిస్తూ వస్తున్నారు కూడా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఈ తరుణంలో యువత, మహిళలు, విద్యావంతులు పెద్ద ఎత్తున జనసేన తరపున పోటీ చేసి ప్రజా ప్రతినిధులు అయ్యి.. వ్యవస్థ మార్పులో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ జనసేన పార్టీ’’ అని తనీశ్ పేర్కొన్నారు.






