- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Municipal Elections: ఇన్‌చార్జులను నియమించిన బీజేపీ
మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు పెంచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జులు, కో-ఇన్‌చార్జులను బీజేపీ అధిష్టానం నియమించింది.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) వేళ బీజేపీ దూకుడు పెంచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జులు, కో-ఇన్‌చార్జులను బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఇన్‌చార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్‌కు బాధ్యతలు అప్పగించారు. కో-ఇన్‌చార్జులుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు రేఖ శర్మలను నియమించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ.. జిల్లాల కలెక్టర్లతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనవరి 24 లేదా 27న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పిటికే మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. పోటీకి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.






