ఉద్యమకారుల సంక్షేమం.. ఉస్మానియా విద్యార్థి నేతలతో కమిటీ చర్చలు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించి, వారి సంక్షేమానికి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఉద్యమకారుల సంక్షేమం.. ఉస్మానియా విద్యార్థి నేతలతో కమిటీ చర్చలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించి, వారి సంక్షేమానికి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి జీఓ నెం.679 ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 6వ తేదీ నుంచి ఉద్యమకారులతో విస్తృతస్థాయి సంప్రదింపుల కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 6న జరిగే తొలి సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి జేఏసీ నాయకులతో కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకం వద్ద ఈ సమావేశం జరగనుంది. కమిటీ సభ్యులు కే.కేశవరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్.కోదండరామ్, అద్దంకి దయాకర్, రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి.. ఓయూ స్టూడెంట్ జేఏసీ నాయకులతో సమావేశమై.. సూచనలు స్వీకరించనున్నారు.

Next Story