రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

by Muthe.Rajitha |

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నట్టు అధికారులు ప్రకటించారు.

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 ఆదివారం రోజున వెల్లడించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు, వీరి ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలను విద్యార్థులు తమ అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Next Story