- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 20 నుండి తెలంగాణ రక్షణ సేన 'జెండా పండుగ.. ఊరూరా పార్టీ సిద్ధాంతాల ప్రచారం
తెలంగాణ రక్షణ సేన పార్టీ మే 20 నుండి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగలను నిర్వహించనుంది. పార్టీ భావజాలాన్ని గ్రామ స్థాయికి చేరవేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavita).. తెలంగాణ రక్షణ సేన" (TRS) పార్టీని ఏర్పాటు చేసిని విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. పార్టీ భావజాలాన్ని, లక్ష్యాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడమే ధ్యేయంగా మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు "జెండా పండుగ" కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు కవిత తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఈ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతి వాడనా పార్టీ జెండాను ఎగుర వేస్తూ, పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించిన 'పాంచజన్య' సిద్ధాంతాలను, పార్టీ విధానాలను ప్రజలకు వివరించనున్నారు.
ఈ నెల రోజుల కార్యక్రమాల్లో కేవలం పండుగ వాతావరణమే కాకుండా, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై కూడా గళమెత్తాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంకితభావం కలిగిన కార్యకర్తలతో కలిసి సామాజిక బాధ్యతగా ప్రతి వర్గానికి చేరువ కావాలని, స్థానిక మరియు రాష్ట్ర స్థాయి సమస్యలపై అవసరమైన చోట ప్రజా ఉద్యమాలను నిర్మించాలని నాయకత్వం సూచించింది. రాజకీయ చైతన్యం కలిగిన ఒక బలమైన జన సమూహాన్ని నిర్మించడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడడమే ఈ జెండా పండుగ ప్రధాన ఉద్దేశమని పార్టీ స్పష్టం చేసింది.






