త్వరలో బీఆర్ఎస్ ముక్కలవబోతోంది: బీజేపీ స్టేట్ చీఫ్

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలో బీఆర్ఎస్ ముక్కలవబోతోంది: బీజేపీ స్టేట్ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు కాబోతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ఇక ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఢిల్లీకి వెళ్లడం.. రావడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని రాంచందర్ రావు విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్రం నిధులు వస్తూనే ఉంటాయని.. ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. కాగా, కాసేపటి క్రితమే పదే పదే మోడీని కలిసే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి కోసమే ప్రతీ మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోడీ తనకు వ్యక్తిగత బంధువుకాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.

Next Story