మంత్రి పొన్నం ప్రభాకర్ తో తెలంగాణ ఉద్యమ కారుల భేటీ

by Muthe.Rajitha |

మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రొ. కోదండరాం సహా తెలంగాణ ఉద్యమ కారుల భేటీ అయ్యి ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలపై చర్చించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ తో తెలంగాణ ఉద్యమ కారుల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి త్వరలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో తెలంగాణ జన సమితి అద్యక్షుడు ప్రొ. కోదండరాం, తెలంగాణ ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలాన్ని ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామని, ఈ నెలలోనే దీని కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి విధివిధానాలను నిర్ణయిస్తుస్తామని ఇటీవల పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కమిటీకి సంబంధించిన విధి విధానాలు ఉద్యమకారుల హామీలు తదితర అంశాలపై ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, కోదండరాం, ఉద్యమకారులు చర్చించారు.

Next Story