- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్ నియామకం
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి మూటగట్టుకున్న రాష్ట్రీయ జనతా దళ్ (Rashtriya Janata Dal) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో తదుపరి తరం నాయకత్వానికి మరింత బలం చేకూరుస్తూ, ఆ పార్టీ కీలక నేత తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav)కు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (National Working President) ఆయనను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన తేజస్వీ యాదవ్, గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను ముందుండి నడిపిస్తున్నారు. తాజా నియామకంతో పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో ఆయనకు మరింత అధికారాలు లభించనున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల వ్యూహ రచన, పార్టీ బలోపేతం దిశగా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. పార్టీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నాయి.






