వ్యవసాయంలో సాంకేతిక విప్లవం..9 కోట్ల మంది రైతులకు 'కిసాన్ ఐడి'లు: పీఎం మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-03-06 10:52:06  IST  )

కృతి వ్యవసాయం, సాంకేతికతతోనే రైతులకు ప్రపంచ మార్కెట్: వెబినార్‌లో ప్రధాని మోడీ పిలుపు. 2029 నాటికి మరో 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలే లక్ష్యం.

వ్యవసాయంలో సాంకేతిక విప్లవం..9 కోట్ల మంది రైతులకు కిసాన్ ఐడిలు: పీఎం మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: హిమాలయ రాష్ట్రాల్లో టెంపర్డ్ నట్ (nut crops) పంటలను ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక ప్రతిపాదనలు చేర్చామని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎగుమతులపై ఆధారపడ్డ ఉత్పత్తి పెరగడం వల్ల ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వ్యవసాయ నిపుణులు, పరిశ్రమలు, రైతులు సమన్వయంతో పనిచేస్తేనే భారత వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయగలమని, క్వాలిటీ బ్రాండింగ్, అంతర్జాతీయ ప్రమాణాల సాకారం కోసం అందరూ కలిసి మేధోమథనం చేయాలని ఆయన సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో, రసాయన రహిత సాగుకు (Chemical-free farming) భారత్ పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం (Natural Farming) ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువ కావచ్చని, దీని కోసం అవసరమైన సర్టిఫికేషన్, ల్యాబొరేటరీ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. కేవలం ఒకే రకమైన పంటపై ఆధారపడటం రైతులకు నష్టదాయకమని, అందుకే పంటల వైవిధ్యీకరణ (Crop Diversification) పై దృష్టి సారించాలని ఆయన కోరారు. అలాగే, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, పప్పు ధాన్యాల సాగు ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు.

పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పుల

అలాగే పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ, పశువులకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు ఇప్పటికే 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ప్రధాని తెలిపారు. గోబర్ధన్ యోజన ద్వారా గ్రామాల్లో వ్యర్థాల నుంచి ఆదాయాన్ని సృష్టించవచ్చని, పాలు, పేడ ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యవసాయ బడ్జెట్‌లను జిల్లా స్థాయి వరకు పటిష్టంగా అమలు చేయాలని, కేటాయించిన ప్రతి రూపాయి రైతు సంక్షేమానికి సద్వినియోగం అయ్యేలా చూడాలని ప్రధాని సూచించారు.

రైతులకు కిసాన్ ఐడీలు

చివరగా, వ్యవసాయంలో సాంకేతికత ప్రాముఖ్యతను వివరిస్తూ.. 'కిసాన్ ఐడి' (Kisan ID) ద్వారా ఇప్పటివరకు 9 కోట్ల మంది రైతులను డిజిటల్ నెట్‌వర్క్‌లో చేర్చామని ప్రధాని పేర్కొన్నారు. దాదాపు 30 కోట్ల భూముల డిజిటల్ సర్వే పూర్తయిందని, 'భారత్ విస్తార్' వంటి AI ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు పరిశోధనా సంస్థలకు, రైతులకు మధ్య వారధిగా మారుతున్నాయని చెప్పారు. అలాగే, గ్రామీణ మహిళల సాధికారత కోసం చేపట్టిన 'లఖ్‌పతి దీదీ' అభియాన్ విజయవంతమైందని, 2029 నాటికి మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

HPV వ్యాక్సిన్లు సురక్షితమేనా? ప్రజల్లో భయాందోళనలు ఎందుకు?

Next Story