న్యూజిలాండ్‌ను ఉతికి ఆరేసిన భారత్.. చివరి మ్యాచ్‌లో భారీ టార్గెట్

by Gantepaka Srikanth |

కేరళలోని తిరువనంతపురం మైదానం వేదికగా ఇండియా - న్యూజిలాండ్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది.

న్యూజిలాండ్‌ను ఉతికి ఆరేసిన భారత్.. చివరి మ్యాచ్‌లో భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని తిరువనంతపురం మైదానం వేదికగా ఇండియా - న్యూజిలాండ్(India vs New Zealand) మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేసేవిధంగా రెచ్చిపోయారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకరి తర్వాత ఒకరు ఓ రేంజ్‌లో చెలరేగారు. న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా కనీవినీ ఎరుగని రీతిలో న్యూజిలాండ్ ఎదుట 270 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 30( నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు), ఇషాన్ కిషన్ 103(ఆరు ఫోర్లు, 10 సిక్సులు), సూర్యకుమార్ యాదవ్ 63(నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు), హార్దిక్ పాండ్యా 42(ఒక ఫోర్, మూడు సిక్సులు) అందరూ సమిష్టిగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గర్‌సన్ రెండు, సాంట్నర్, డఫీ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 271 పరుగులు చేయాల్సింది ఉంది.

Next Story