- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి
రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని టీఆర్టీఎఫ్ ఎన్నికల కమిషన్‌ను కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీటీఎఫ్) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డిలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో లేని అనేకమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇతర ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉన్నారని, విధుల్లో ఉన్న కారణంగా చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయాణించి వెళ్లలేకపోతున్నారని తెలిపారు.
దీనివల్ల వారు తమ రాజ్యాంగబద్ధమైన హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఓటు హక్కు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ప్రశాంతంగా ఓటు వేసేందుకు వీలుగా, పోలింగ్ రోజున వారికి ప్రత్యేక సెలవును మంజూరు చేస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణను స్వాగతిస్తున్నామని, అయితే ఉపాధ్యాయులందరూ ఓటు వేసేందుకు వీలైన వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా టీఆర్టీటీఎఫ్ నేతలు విజ్ఞప్తి చేశారు.






