- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీచర్ల ధర్నా
by Bhoopathi Nagaiah |
భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల నుంచి మహిళా ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 13 జిల్లాల నుంచి మహిళా ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. మంగళవారం పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చంటి పిల్లలతో సహా వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ''చెరొక జిల్లాలో ఉద్యోగం.. పిల్లల భవిష్యత్తు గందరగోళం'' తదితర డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. ఎండలోనే కూర్చొని ప్రభుత్వం న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులను భారీగా మోహరించినప్పటికీ.. శాంతియుత ధర్నాతో మిన్నకుండిపోయారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ చేస్తూనే.. మరోపక్క భార్యాభర్తలకు ఒకే దగ్గర ఒకే జిల్లాలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story






