విద్యార్థులకు అవి చూపించిన టీచర్.. తల్లిదండ్రులు ఏం చేశారంటే

by Web Desk |
విద్యార్థులకు అవి చూపించిన టీచర్.. తల్లిదండ్రులు ఏం చేశారంటే
X

దిశ, ధర్మారం: విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన సార్.. కామంతో కళ్లు మూసుకుపోయి ఆన్సర్ చూసుకోండి అంటూ అశ్లీల చిత్రాలు చూపించాడు. విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో టీచర్ ను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామం జెడ్ పి హెచ్ ఎస్‌లో సైన్సు టీచర్ గా పనిచేస్తున్న ఓ సార్ విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న జరిగిన సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ పేరుతో స్మార్ట్ ఫోన్ వాడుతూ.. అందులో ఓ విద్యారికి అశ్లీల చిత్రాలు చూపించినట్టు తెలిసింది. అయితే ఆ విద్యారి భయంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ రోజు పరీక్షలో భాగంగా ఓ విద్యార్థికి వచ్చిన డౌట్ ను ఉపాద్యాయున్ని అడుగగా.. నాకు ఆన్సర్ తెలియదంటూ.. ఫోన్ లో చూసుకోమని అశ్లీల చిత్రాలు పెట్టి విద్యార్థినికి ఇచ్చారు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా కంగు తిన్న విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కి సమాచారం అందించింది. పేరెంట్స్ పాఠశాల కు చేరుకొని సైన్స్ టీచర్ ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన సమాచారాన్ని హెచ్‌ఎం మంజుల పెద్దపల్లి డి.ఈ. ఓ. కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డీ ఈ ఒ మాధవి ధర్మారం ఎంఈఓ ఛాయదేవికి సమాచారం అందించి సంఘటన పై సమగ్ర విచారణ జరిపి తమకు నివేదిక అందించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన ఎం.ఈ. ఓ. ఛాయాదేవి కొత్తూరు పాఠశాలకు వెళ్లి ఎచ్.ఎం. మంజుల తో కలిసి సంఘటనపై విచారణ చేసి నివేదికను డి.ఈ. ఓ.కు సమర్పించారు. ఇదిలా ఉండగా నేను విద్యార్థులకు ఎలాంటి అశ్లీల చిత్రాలు చూపించ లేదని, పొరపాటున ఏదైనా ప్లే అయ్యి ఉండొచ్చని తోటి ఉద్యోగులతో బాధిత టీచర్ అన్నట్లు సమాచారం.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story