- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిక్కర్‌లో మూత్రం పోశాడని.. మర్మాంగంపై వాతలు పెట్టిన టీచర్
వారణాసిలోని ఒక ప్రైవేట్ ప్లే స్కూల్‌లో నర్సరీ చదువుతున్న బాలుడు నిక్కర్‌లో మూత్రం పోశాడన్న కోపంతో, ఉపాధ్యాయురాలు చాకును వేడి చేసి అతని మర్మాంగంపై వాతలు పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : వారణాసిలోని ఒక ప్రైవేట్ ప్లే స్కూల్‌లో నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల ఉపాధ్యాయురాలు దారుణంగా ప్రవర్తించింది. వాష్ రూమ్‌కు వెళ్తానని అడిగినా పంపకపోవడంతో బాలుడు నిక్కర్‌లోనే మూత్రం పోసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన టీచర్, చాకును వేడి చేసి పక్క గదిలోకి తీసుకెళ్లి ఆ చిన్నారి మర్మాంగంపై వాతలు పెట్టింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటికి వచ్చిన బాలుడు తీవ్ర నొప్పితో విలవిలలాడటంతో తల్లి పరిశీలించి, విషయం తెలుసుకుని భర్తకు చెప్పింది. మర్నాడు తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లి ఫిర్యాదు చేసినా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు టీచర్ తోపాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనపై యూపీ భగ్గుమంది. అధికార, ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా స్పందించారు. ఒక చిన్నారి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్య అని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.






