- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామన్వెల్త్: భారత్ ఖాతాలో మరో 3 పతకాలు
గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ 2026 క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ 2026 క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. నిలకడైన ప్రతిభను కనబరుస్తూ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్న భారత క్రీడాకారులు, తాజాగా తమ ఖాతాలో ఒక స్వర్ణ పతకంతో పాటు రెండు రజత పతకాలను అందించారు. వివిధ విభాగాల్లో పోటీపడిన అథ్లెట్లు ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ అత్యుత్తమ ప్రదర్శనతో ఇప్పటివరకు మొత్తం 10 మెడల్స్ తో మెరిశారు.
ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును క్రీడా రికార్డుల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
వీరితో పాటు వెయిట్‌లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో పల్లూరి అజయ్ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. బార్‌బెల్‌ను సునాయాసంగా ఎత్తుతూ క్లీన్ అండ్ జెర్క్, స్నాచ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసారు. ఒకే రోజున అటు పారా అథ్లెటిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు భారత్ అందుకున్న 10 పతకాలతో మెడల్స్ లిస్ట్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది.






