- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"యాంటీ పేపర్ లీక్ బిల్లు" సిద్ధం.. అందులో ఏముందంటే??
దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)' చట్టానికి సవరణలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లీకేజీలకు పాల్పడే వారికి కఠిన జైలు శిక్షలతో పాటు భారీగా జరిమానాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన సవరణల ప్రకారం, పేపర్ లీక్‌కు పాల్పడిన వ్యక్తికి విధించే గరిష్ట జైలు శిక్షను 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు, గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచనున్నారు. అలాగే, లీకేజీల్లో భాగస్వాములయ్యే అధికారులకు జైలు శిక్షను ఐదేళ్ల పాటు పెంచడంతో పాటు, ఈ అక్రమాలకు పాల్పడే సిండికేట్లకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, మరియు జరిమానాను రూ.1 కోటి నుంచి రూ.10 కోట్లకు భారీగా పెంచబోతున్నారు.
ఈ తరహా కేసులను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లు సవరణలపై నేడు పార్లమెంటులో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై పార్లమెంటులో తమ వాదనలు వినిపించేందుకు ప్రతిపక్షాలు కూడా సమాయత్తమయ్యాయి.






