CJP అల్టిమేటం ఎఫెక్ట్.. బిహార్ బాటలో అస్సాం

by Muthe.Rajitha |

విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంరించుకొని, అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయకపోతే మరోసారి ఉద్యమం తప్పదని CJP జారీ చేసిన హెచ్చరికలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది.

CJP అల్టిమేటం ఎఫెక్ట్.. బిహార్ బాటలో అస్సాం
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంరించుకొని, అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయకపోతే మరోసారి ఉద్యమం తప్పదని CJP జారీ చేసిన హెచ్చరికలకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అరెస్టులను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేసాయి. కాగా అంతకముందు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన కేసులను (FIRs) ఉపసంహరించుకుంటామని కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని సీజేపీ(CJP) ఆరోపించింది. ప్రభుత్వ హామీని నమ్మి తాము నిరసనలు విరమించినప్పటికీ, ఇంతవరకు కేసులను ఎత్తివేయకపోగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పలువురు ఆందోళనకారులను అరెస్టు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులపై కేసులను వెంటనే తొలగించకపోతే మళ్లీ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని సీజేపీ నాయకులు కేంద్రానికి తీవ్ర అల్టిమేటం జారీ చేశారు.

సీజేపీ, విద్యార్థి సంఘాల తీవ్ర నిరసనలు, హెచ్చరికల నేపథ్యంలో బిహార్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని రకాల కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, జైళ్లలో ఉన్న వారిని తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాయి. ఈ నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వుల పత్రాలను సీజేపీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మీడియాకు విడుదల చేశారు.

Next Story